Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR : మసిపూసి మారేడుకాయలతో అధికారపీఠమెక్కిన కాంగ్రెస్

–నల్లగొండ రైతు మహాధర్నాలో బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR : ప్రజా దీవెన నల్లగొండ: ప్రజల ముం దుకొచ్చి పచ్చి అబద్ధాలు, మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చిoదని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తార కరామారావు( కేటీఆర్) తీవ్రస్థాయి లో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప రిపాలనలో అన్ని విధాలుగా విఫ లమైందని విమర్శించారు. నల్లగొం డ జిల్లాలో రైతు ధర్నాలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్‌ పాలకుల పై విమ ర్శల వర్షం గుప్పించారు. కాంగ్రెస్‌ పాలన లో మహాత్మాగాంధీ యూని వర్సిటీ లో విద్యార్థులు గొడ్డు కారం తో అన్నం తినాల్సిన దుస్థితి ఏర్ప డిందని ఆరోపించారు.

 

 

తన రాక సంద ర్భంగా నల్లగొండ ప్రజల ఆదరణ చూస్తుంటే తాను రైతు ధర్నాకు వచ్చినట్లు లేదని, విజ యోత్సవ ర్యాలీకి వచ్చినట్లు ఉం దని పేర్కొ న్నారు. మంగళవారం నల్లగొండలో అడుగుపెట్టగానే మ హాత్మాగాందీ యూనివర్సిటీ దగ్గర మూడు, నాలుగు వందల మంది విద్యార్థులు రోడ్డు మీదికి వచ్చార ని, అన్నా కేసీఆర్‌ పాలనలో మాకు అన్ని వసతులు ఉండేవని, ఇప్పు డు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన త ర్వాత గొడ్డు కారంతో అన్నం తినే దుస్థితి వచ్చిందని, ఒకసారి మీరు మా క్యాంపస్‌కు రావాలని అడి గారని, తప్పకుండా మధ్యాహ్నం రెండున్నర గంటలకు వస్తానని వా ళ్లకు చెప్పి వచ్చానని చెప్పారు.

 

 

వారి వద్ద నుంచి బయలుదేరి ముం దుకు రాగానే కళ తప్పిన ఐటీ టవ ర్‌ కళ్లకు కనిపించిందని, నల్లగొం డలో వెంకట్‌ రెడ్డి వచ్చినంక ఏమైందో ఏమోగానీ, మొత్తానికైతే ఐటీ టవర్ కళ తప్పిందని వ్యా ఖ్యానించారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన ప్పుడు ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి గడియారం కూడలికి దాకా జనం భారీ సంఖ్యలో కనిపించారని, అ దంతా చూస్తే నాకు ధర్నాకు వచ్చి నట్టు అనిపించలేదని, కేసీఆర్‌ మళ్లీ సీఎం అయ్యిండ్రు, మళ్లీ మన ప్రభుత్వం వచ్చింది, మళ్లీ భూపా ల్‌ రెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు అని పించింది. ఒక విజయోత్సవ ఊరే గింపు జరిగినట్లుగా ఉందని భారీ గా ధర్నాకు తరలివచ్చిన నల్లగొండ రైతు బిడ్డలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని కేటీఆర్‌ పేర్కొ న్నారు.