Vasavi Club : ప్రజా దీవెన,కోదాడ: పట్టణం లోని స్థానిక వాసవి భవన్ లో మంగళవారం వాసవి క్లబ్ వార్షిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా 2025 సం కు గాను అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . అధ్యక్షులుగా సేకు శ్రీనివాసరావు, కార్యదర్శి గా పత్తి నరేందర్, కోశాధికారిగా వెంపటి ప్రసాద్ లను నియమిస్తూ రీజియన్ చైర్మన్ బెలిదే భరత్ మరియు జోన్ చైర్మన్ వంగవేటి నాగరాజులు కలిసి వాసవి క్లబ్ అధికారులు, పట్టణ ఆర్యవైశ్య పెద్దల సమక్షం లో నియామక పత్రం అందచేసారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నియామకముకు సహకరించిన వాసవి క్లబ్ ఆఫీసర్లకు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులకు తోటి వాసవియన్స్ కు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేసారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవేటి రామారావు, ఇంటర్నేషనల్ ప్రోగ్రాం ఆఫీసర్స్ పబ్బా గీత, చల్లా విజయశేఖర్, డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ చల్లా లక్ష్మీనరసయ్య, ఇమ్మడి సతీష్ బాబు, బండారు శ్రీనివాసరావు, దేవరశెట్టి శంకర్, చుండూరు నాగమల్లేశ్వర్రావు, గుడుగుంట్ల సాయి, పైడిమర్రి సతీష్, పైడిమర్రి రామారావు, యాద కిరణ్, అఖిల్ సాయి, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పైడిమర్రి నారాయణరావు, పందిరి సత్యనారాయణ, చల్లా ప్రకాష్ రావు, యాదా సుధాకర్, సేకు రమేష్, ఇమ్మడి రమేష్, మాధవి, మహంకాళి హుస్సేన్ రావు, శ్రీరంగం లక్ష్మణ్, ఉప్పలవంచు శ్రీనివాసరావు, కోటి, వంగవేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ చాలువులతో సత్కరించారు