పోటీ పరీక్షలలో విద్యార్థులు తమ ప్రతిభను చాటాలి: లక్ష్మీనారాయణ రెడ్డి
Lakshminarayana Reddy : ప్రజా దీవెన,కోదాడ: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభను చాటుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని టీ పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు కోదాడ ఎలెక్ట్రాన్ మీడియా ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్న గ్రాండ్ టెస్ట్ పోస్టర్ అయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా లక్షినారాయణరెడ్డి మాట్లాడుతూ.. నేడు కోదాడ పట్టణంలోని స్థానిక మండల సహకార కళాశాలలో 9:30గంటలకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారని తెలిపారు విద్యార్థులు.
ఈ పోటీ పరీక్షలకు హాజరై తమ లో ఉన్న మేద శక్తిని వెలికి తీసి వారి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇలాంటి గ్రాండ్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అంతేకాకుండా పదవ తరగతి ఫైనల్ పరీక్షలకి వెళ్ళే విద్యార్థులకు ఇలాంటి గ్రాండ్ టెస్ట్ లు ఒక ధైర్యాన్నీ ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు, ప్రధాన కార్యదర్శి గంధం వెంకటనారాయణ, తోటపల్లి నాగరాజు, పవన్ కుమార్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.