Dr. Salaiah : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ఏ సంస్థకైనా నివేదిక కీలకమని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహ ఆచార్యులు డా. సాలయ్య అన్నారు. గురువారం నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనే అంశం పైన విస్తృత ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ సాలయ్య పాల్గొని ప్రసంగిస్తూ ప్రాజెక్టు ప్రాముఖ్యత మరియు రిపోర్ట్ ని ఎలా తయారు చేయవలెను అంశం పైన అవగాహన కల్పించారు. నివేదిక రూపకల్పనలో పాటించాలల్సిన నియమాల గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షత వహించగా .
ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు డాక్టర్ జె నాగరాజు ,డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇంచార్జ్ సావిత్రి, కామర్స్ అధ్యాపకులు ఎస్ వాసుదేవ్ , ఏ జాన్ రెడ్డి , ఎన్ శంకరయ్య ఎస్ కే వై బాబా, డా. మిర్యాల శ్వేత , జె నరేష్, కే నరేష్, పీజీ కామర్స్ అధ్యాపకులు డి వెంకటేష్ , ఏ రవీందర్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.