Sea-whistle is a deterrent to irregularities: అక్రమాలకు అడ్డుకట్టకే సీ-విజిల్
--సాంకేతికత దన్నుగా కోడ్ ఉల్లంఘనలపై నిఘా -- కేవలం వంద నిమిషాల్లోనే పరిష్కారం -- సత్వర వేగంగా చర్యలు తీసుకుంటాం -- జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్
అక్రమాలకు అడ్డుకట్టకే సీ-విజిల్
–సాంకేతికత దన్నుగా కోడ్ ఉల్లంఘనలపై నిఘా
— కేవలం వంద నిమిషాల్లోనే పరిష్కారం
— సత్వర వేగంగా చర్యలు తీసుకుంటాం
— జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్
ప్రజా దీవెన/నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ ( District Election Officer and District Collector ARV Karnan said that the Election Commission is using technology to conduct the elections transparently) వెల్లడించారు. ఎన్నికల వేళ జరిగే అక్రమాలను పౌరులు ఎప్పటికప్పుడు సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించినా కూడా ఆ ఘటనలను ఈయాప్ ద్వారా తెలియజేయవచ్చని (Even if someone violates the code, those incidents can be reported through eApp), ఆయా పార్టీల అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు వంటి వివరాలను నేరుగా ‘సీ-విజిల్’ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అదే విధంగా లౌడ్స్పీకర్లు వాడినా, మతాలు, కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పర్మిషన్ లేకుండా ఎన్నికల ర్యాలీలు నిర్వహించినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఈ యాప్‌ను గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న అక్రమాలను పొందుపరచవచ్చని, ఈ యాప్‌ను ఇప్పటికే పది లక్షల మంది పౌరులు డౌన్లోడ్ చేసుకున్నారని ఈ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులపై పది, నిమిషాల వ్యవధిలోనే సంబంధిత అధికారులు అక్కడికి వచ్చి తగిన చర్యలు (On the complaints received through this app, within ten minutes, the concerned authorities will come there and take appropriate action) తీసుకుంటారు. ఈ చర్యల ద్వారా ప్రజల్లో, వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని ఎన్నికల కమిషన్ భావిస్తున్నదని పేర్కొన్నారు.
*వంద నిమిషాల్లోనే పరిష్కారం:* స్మార్ట్‌ఫోన్‌లో గుగూల్ ప్లే స్టోర్ నుంచి సీ-విజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చుని, అందులో వివరాలను నమోదు చేసుకోవాలని, ఎక్కడైతే ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందో దానికి సంబంధించిన ఫొటో లేదా వీడియో తీసి దాన్ని యాప్‌లో అప్లోడ్ ( Take a photo or video of any election code violation and upload it in the app) చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో నాయకులతో కూడిన ఫ్లెక్సీలు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజా ప్రతినిధుల ఫొటోలు, ఇలాంటి కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే వాటిని యాప్‌లో ఒక్క క్లిక్‌తో అప్లోడ్ చేయొచ్చన్నారు.
సీ-విజిల్ యాప్‌లో అప్లోడ్ చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం వెంటనే పరిశీలిస్తుందని, వంద నిమిషాల్లోనే చర్యలకు పూనుకుంటుందని స్పష్టం చేశారు. యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్ నంబర్లను ఈసీ గోప్యంగా ఉంచుతుందని (EC will keep the names and cell numbers of those who have complained to the Election Commission through the app confidential) పేర్కొన్నారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే విధానంపై ప్రజలకు, అధికార యంత్రాగం అవగాహన కల్పిస్తుందని, ఈ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకుంటాం. ఎన్నికల అక్రమాలపై సీ-విజిల్ యాప్‌తోపాటు 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చని ( Complaints about election irregularities can be made by calling 1950 toll free number along with C-Whistle app) కర్ణన్ తెలియజేశారు.