Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

C.M.Revanth Reddy : మహోజ్వల ఘట్టానికి అడుగు, ఉస్మానియా ఆసుపత్రికి భూమి పూజ

C.M.Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: శతాబ్ద కాలపు చరిత రాబోయే వందేళ్ల పా టు సేవలు అందించబోయే ఉస్మా నియా జనరల్ ఆసుపత్రి నూతన నిర్మాణ మహోజ్వల ఘట్టానికి అడుగుపడింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిఉస్మానియా ఆసు పత్రి నూతన భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమా ర్క , మంత్రులు దామోదర రాజన ర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , పొన్నం ప్రభాకర్, సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డిల తో కలిసి గోషామహల్ స్టేడియం ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణల కొత్త భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వ హించారు.

 

 

సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అప్జల్‌గంజ్‌లోని ప్రస్తు త ఆసుపత్రిని మరింత ఆధునిక సౌకర్యాలతో వచ్చే వందేళ్లకు సరి పడా మౌలిక సదుపాయాలతో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరగడం పట్ల వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు.మొత్తంగా 26 ఎకరా ల ప్రాంగణంలో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం మేరకు భవన నిర్మాణాలు చేపట్టనుండగా, ఈ ఆసుపత్రిలో 2 వేల పడకలతో 29 మేజర్, 12 మైనర్ ఆపరేషన్ థియే టర్స్ వంటి సర్వ హంగులను సమ కూర్చనున్నారు.

 

 

ఆసుపత్రి నిర్మాణా నికి శంకుస్థాపన చేసిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, వైద్యులతో కలిసి ఆసుపత్రి నమూ నాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నగర మేయర్ గద్వా ల విజయలక్ష్మి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూతో పాటు పలువురు ఉన్న తాధికారులు పాల్గొన్నారు.