Dr. Upender : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నిత్యజీవితంలో మాతృభాష తర్వాత గణితానికే ప్రాధాన్యత ఉంటుందని కొచ్చిన్ విశ్వవిద్యాలయం సహ ఆచార్యులు నౌపాల్ అన్నారు. శుక్రవారం నాగార్జున ప్రభుత్వ కళాశాల గణితశాస్త్ర విభాగంలో కేరళలకు చెందిన కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ,అసోసియేట్ ప్రొఫెసర్ నౌపాల్ రియల్ ఎనాలసిస్ పై విస్తృతోపన్యాసం ఇచ్చారు. గణితశాస్త్రం నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నదో ఉదాహరణలతో విద్యార్థులకు తెలియజేయడం జరిగినది.
వృత్తిపరమైన రంగంలో, గణిత ప్రావీణ్యం అనేక కెరీర్ అవకాశాలకు తలుపులు తెరుస్తుందని అన్నారు. ఫైనాన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు కళలు వంటి పరిశ్రమలు గణితలో ప్రావీణ్యత ఉన్న వ్యక్తులనే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. డేటా విశ్లేషణ నుండి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వరకు గణిత నైపుణ్యాలు అనేక రంగాలలో విజయానికి మూలస్తంభంగా ఉన్నాయి అని వివరించారు
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉపేందర్ మరియు మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఇంచార్జ్ ఎం వెంకటరెడ్డి, లెక్చరర్స్ డాక్టర్ మధుకర్ రెడ్డి కనకయ్య ,రజని, మరియు బాల కార్తీక్ లు పాల్గొన్నారు.