Komati Reddy Venkata Reddy : ప్రజాదీవెన, నల్గొండ : అర్హత కలిగిన పేద జర్నలిస్టులందరికీ ఇల్లు స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక టీఎన్జీవోస్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని పట్టణ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన జర్నలిస్టులకు బహుమతు ప్రధానం చేయడంతో పాటు, అర్హులైన జర్నలిస్టులకు ఐకాన్ ఆస్పత్రి సౌజన్యంతో 50 శాతం రాయితీతో కూడిన హెల్త్ కార్డులను శుక్రవారం ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకాన్ ఆస్పత్రి సౌజన్యంతో 50% రాయితో కూడిన ఉచిత వైద్య సేవలను అందించడం అభినందనీయం అన్నారు. నల్లగొండ పట్టణంలో అర్హత కలిగిన జర్నలిస్టులకు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాని సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు పట్టాల పంపిణీ ఆలస్యం జరుగుతుందన్నారు.
ఇప్పటికే పట్టణంలో పేదలందరికీ ఇండ్లను ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని పేద విలేకరులందరికి కూడా అందులో అవకాశం కల్పిస్తామన్నారు. ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం జరుగుతుంది అన్నారు. ఐఐటి, ఎంబిబిఎస్ వంటి వాటిల్లో ప్రతిభ చాటిన పేద విద్యార్థులకు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడైనా ప్రతిభ కనబర్చిన వారికి ప్రతీక్ ఫౌండేషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. నల్లగొండ పట్టణాభివృద్ధికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన జరుగుతుందన్నారు.
ముఖ్యంగా ఘాట్ రోడ్ నిర్మాణంతోపాటు కోట్ల రూపాయల వ్యయంతో అనేక కార్యక్రమాలు చేపట్టటం జరిగింది అన్నారు. జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కోటగిరి దైవాదినం, ఏచూరి భాస్కర్, ఫహిముద్దీన్, గుండె గోని జయశంకర్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పులి మామిడి మహేందర్ రెడ్డి, గాదె రమేష్ , కోశాధికారి దండంపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.