Surapalli Kuchelu : ప్రజా దీవన,సంస్థాన్ నారాయణపురం : సంస్థాన్ నారాయణపురంలో శ్రీ మార్కండేశ్వర దేవస్థానం 26వ వార్షికోత్సవ జాతర ఆదివారం నుండి బుధవారం వరకు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా మంగళవారం నాంపల్లి మహేష్ విమల దంపతులచే అన్నదాన కార్యక్రమం,అదే రాత్రి భావనా ఋషి బద్రావతి దేవి ల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.మరుసటి రోజు రథోత్సవం ఉంటుంది.
కావున మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాల్సిందిగా మార్కండేయ దేవస్థానం అధ్యక్షులు సూరపల్లి కుచేలు,ఉపాధ్యక్షులు చెరుపల్లి లక్ష్మయ్య,మిరియాల రాజరత్నం, కార్యదర్శి గుర్రం వెంకటేశం,కోశాధికారి ఏలె నరసింహ్మ,సహాయ కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్,కర్నాటి నవీన్,కమిటీ సభ్యులు కోరారు.