Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nagam Varshit Reddy : ఇది వందశాతం అభివృద్ధి బడ్జెట్‌ ,నాగం వర్షిత్ రెడ్డి

Nagam Varshit Reddy : ప్రజా దీవెన, నల్గొండ: రైతు సంక్షే మం , మధ్యతరగతికి ఉపశమనం, మహిళలకు యువతకు సాధికా రిక కల్పించడం వరకు వికసిత్ భారత్ లక్ష్యంగా తీసుకొని ప్రవేశపె ట్టినటువంటి బడ్జెట్ అన్ని రంగాలలో 100% అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని నల్గొండ బిజెపి జిల్లా అధ్యక్షులు డా,నా గం వర్షిత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ తెలియజేశారు.

ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ మౌలిక సదుపా యాల కల్పన నుండి పెట్టుబడులను ప్రోత్సహించడం వరకు, ఈ బడ్జెట్ దేశంలోని ప్రతి ఒక్కరిని, వారి కలను సాకారం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తమన్నారు.సాహసోపేతమైన, సమ్మిళిత మరియు భవిష్యత్తుకు బంగారు బాట చూపేలా ఉన్న ఈ బడ్జెట్‌ను రూపొం దించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ,  ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజే స్తున్నాము అని వర్షిత్ రెడ్డి తెలిపారు.