*సభ్యత్వ నమోదుకు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
*పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెదేపా పార్: సైదేశ్వర రావు
Muthineni Saideswara Rao : ప్రజా దీవెన, కోదాడ: తెదేపా కార్యకర్తలు, నాయకుల సమిష్టి కృషితోనే సభ్యత్వ నమోదులో కోదాడ నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని తెదేపా రాష్ట్ర మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వరరావు అన్నారు. శనివారం వారి నివాస గృహములో ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా అయన పాల్గొని మాట్లాడారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. 5193 సభ్యత్వాలు నమోదు చేసి రాష్ట్రస్థాయిలో తాను రెండో స్థానంలో నిలవడం కార్యకర్తల కృషితోనే సాధ్యమైందన్నారు. ఇదే స్ఫూర్తితో అధిష్టానం నిర్ణయం మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలి అన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుగోమ్ములని కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానన్నారు.
పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నాయకులంతా కష్టపడి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ నాయకులు దొడ్డ గురవయ్య, కొల్లు నరసయ్య, భయ్యా నారాయణ, పిట్టల శోభన్ బాబు, కొల్లు గురవయ్య, చాపల శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ఏటుకూరి సురేష్, కొల్లు సత్యనారాయణ, థామస్, రామ్మోహన్ రావు,హనుమంతరావు, శివ,బాబా, నరేష్ తదితరులు పాల్గొన్నారు.