ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్
Khammampati Shankar : ప్రజాదీవెన, నల్గొండ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కంబాలపల్లి గ్రామంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. కానీ ప్రభుత్వం నుండి వచ్చే విద్యార్థుల మెస్కాస్మత్కి చార్జీలను 100 మందికి బిల్లులు డ్రా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.
అంటే ప్రభుత్వం నుండి వచ్చే వస్తువులు బట్టలు దుప్పట్లు నోటు పుస్తకాలు స్వెటర్లు బెడ్స్ మంచాలు ఇవన్నీ బహిరంగ మార్కెట్లో విక్రయానికి పెడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం 10 మంది విద్యార్థులకు కూడా నాణ్యమైన భోజన అందించకుండా ఉదయం వండిన అన్నం పప్పు సాంబార్ ను మధ్యాహ్నం ,సాయంత్రం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులకు అందించే కూరగాయలు గాని ఆయిల్ అత్యంత దుర్మార్గంగా పేరుకుపోయిన గడ్డలతో చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి కంభాలపల్లి గిరిజన పాఠశాలలో వున్నది .
రాష్ట్రంలో గురుకులాలు సంక్షేమ హాస్టల్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటే కనీసం ఇలాంటి నాశరకమైన వంట నూనెలు కూరగాయలు పెట్టడం వల్లనే ఇలా జరుగుతుందని. ఇంత జరుగుతున్న కంబాలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
కంబాలపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలోపేద మద్య తరగతి వెనుకబడిన గిరిజన విద్యార్థులకు కనీసం ప్రభుత్వం అందించే మేడం అందించకుండా వారానికి కేవలం రెండు గుడ్లు ఒక్క అరటిపండు మాత్రమే పెడుతూ విద్యార్థులకు స్నాక్స్,పల్లి పట్టి , ఏమి ఇవ్వకుండా విద్యార్థుల రక్తాన్ని తాగుతున్న కంబాల పల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ ఆగడాలపై తక్షణమే నల్గొండ జిల్లా కలెక్టర్ స్పందించి గిరిజన ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేయాలని పేద మధ్యతరగతి విద్యార్థుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రమావత్ లక్ష్మణ్ నాయక్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.