Aghori : ప్రజా దీవెన ,వేములవాడ : గతంలో అఘోరీ చేసిన వ్యాఖ్యలతో రేపు ఏం జరగనుందో అని అంతటా చర్చ జరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరీ ఫిబ్రవరి 3న వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చి ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వేములవాడ వైపు మళ్లింది. అఘోరీ చెప్పిన 3వ తేదీ మరి కొద్ది గంటల్లోనే రానుంది. దాంతో నిజంగా ఆమె వస్తుందా…? రాదా..? వచ్చి దర్గాను ముట్టుకుంటుందా…? లేదా అనేది సస్పెన్స్ గా మారింది. నిజంగా అఘోరీ వస్తే వేములవాడలో పరిస్థితి ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. వేచి చూడాలి మరి ఏం జరుగుతుందో..