Uday Rahul : ప్రజా దీవెన, జంగారెడ్డిగూడెం: అభం శుభం తెలియని ఆ బాలుడి పట్ల కన్న తండ్రే చూపిన కర్కష త్వం అమానుషం. కర్కశుడైన తండ్రి కొన్న కొడుకు పై కనీసం కనికరం ప్రతినిత్యం ఆకారణంగా చిత్రహింసలకు గురి చేస్తున్న సంఘటన జంగారెడ్డిగూడెంలో వెలుగులోకి వచ్చింది. నాన్న అనే పదానికే తలవంపులు తెచ్చాడు ఆ దుర్మార్గపు తండ్రి. విచక్షణ మరిచి దాష్టీకం ప్రదర్శించడంతో ఆ బాలు డు విలవిలాడాడు. బాధితుడి కధ నం మేరకు జంగారెడ్డిగూడెం పట్ట ణానికి చెందిన పవన్, శశిలు భా ర్యా భర్తలు వీరికి కుమారుడు ఉదయ్ రాహుల్ (4వ తరగతి), కుమార్తె రేణుక (1వ తరగతి) ఉన్నారు.
కొంత కాలంగా తండ్రి పవన్ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, శనివారం రాత్రి ఫోన్ ఛార్జర్ తీగతో కొట్టాడని ఉదయ్ తెలిపాడు. చిత్రహింసలకు గురి చే స్తున్న బాలుడిని స్థానికులు రక్షించి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుప త్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు, సిబ్బంది నిర్ఘాంతపోయా రు తనను, చెల్లిని కొడుతుంటే త మ తల్లి చూస్తూ మౌనంగా ఉంద ని, అసలు ఎందుకు కొడుతున్నారో తెలియడం లేదనీ వాపోయాడు. దెబ్బలపై కారం సైతం పూయడం తో పాటు కారం తినిపిస్తున్నాడం టూ ఉదయ్ రాహుల్ వెక్కి వెక్కి ఏడుస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.