Baddula Arvind : ప్రజా దీవెన, నారాయణపురం : నారాయణపురం మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో నారాయణపురం గ్రామానికి చెందిన బద్దుల అరవింద్ అడ్వకేట్ 8వ వర్ధంతి సందర్భంగా మిత్రులు పవర్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి సరస్వతి మాత దేవాలయంలో విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పదవ తరగతి విద్యార్థినిలకు సుధీర్ బికుమాండ్ల మా గురువు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు తపస్య కామర్స్, మానేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫసర్ చేత అవగాహన సదస్సు నిర్వహించారు.
కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ విద్యార్థినికి సొంత ఖర్చులతో చదివిస్తాము బద్దుల అరవింద్ మిత్రులు.అనంతరం పదవ తరగతి విద్యార్థినిలకు ఎగ్జామినేషన్ కిట్స్ పంపిణీ చేశారు.కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో పదవ తరగతి ఉత్తమ విద్యార్థినికి సొంత ఖర్చులతో చదివిస్తాము అని అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో పవర్ యూత్ అధ్యక్షులు ఉప్పల నాగరాజు,కొండ శ్రీకాంత్ గౌడ్ ,శీకీలామెట్ల శివప్రసాద్,వీడం సాయికుమార్,కొమిశెట్టి రవి,బచ్చనగోని కిరణ్,రాపర్తి నిఖిల్, నార్సింగి బాలు, శికిలామెట్ల శశికాంత్, ఏలే సుభాష్, ఉపాధ్యాయనీలు, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.