Varikuppala Venkanna : ప్రజా దీవెన, శాలిగౌరారం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లు పెట్టుబడిదారులకు, ఉన్నత వర్గాలకు అనుకూలంగా ఉందని పేద మధ్య తరగతి ప్రజలకు,కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని వెంటనే దీనిని సవరించాలని అఖిల భారత వ్యవసాయం కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వరికుప్పల వెంకన్న అన్నారు. శాలిగౌరారం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో వెంకన్న మాట్లాడుతూ బడ్జెట్ ను పేద మధ్య తరగతి వర్గాల ప్రజల కోసం సవరించే చర్యలు చేపట్టాలన్నారు.
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు కార్మికులకు. రైతులకు. వ్యవసాయ కూలీల. మనుగడకు ఆటంకంగా మారిందని మొత్తం సేవా రంగం కుదేలు అయిపోయిందని, విద్యా, వైద్యం ఉపాధి కరువై కార్మికులకు కనీస వేతనాలు అందక అల్లాడిపోతున్నారని. దేశ సంపదనంతా కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకు .దోచి పెడుతూ బడ్జెట్లో కూడా వారికి పెద్ద పీట వేయడం సరైంది కాదని. రోజు రోజుకు నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ. పేదలను మరింత పేదలుగా. కృంగిపోయే విధంగా. ధనికులకు పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని .ఈ విధానాన్ని వెంటనే నిలిపివేసి బడ్జెట్ ఫలాలు శ్రామిక వర్గాలకు మేలు చేసే రకంగా ఉండేలా సవరణలు చేయాలని వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.