* కోదాడ సీనియర్ క్రికెట్ లెజెండ్ టోర్నమెంట్‌కు ప్రేక్షకుల భారీ స్పందన
* క్రికెట్ లో రాణించి కోదాడకు పేరు తేవాలి. జానీ భాయ్, బషీర్ భాయ్
Mahbub Jani : ప్రజా దీవెన,కోదాడ: పట్టణంలో భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని కోదాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహబూబ్ జానీ కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ లు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో లగాన్ టీం కోదాడ జూనియర్ క్రికెటర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కోదాడ సీనియర్ క్రికెట్ లెజెండ్ పోటీల ప్రారంభం బహుమతి ప్రధానోత్సవాల కార్యక్రమాల్లో వారు ముఖ్యఅతిథిలుగా పాల్గొని మాట్లాడారు క్రీడలు ఐకమత్యానికి స్నేహభావానికి ప్రతీకలు అన్నారు.
వివిధ వృత్తులు నిర్వహించుకుంటూ కూడా క్రికెట్ క్రీడా ప్రతిభావంతంగా ఆడడం అభినందనీయమన్నారు క్రీడాకారుల్లో స్ఫూర్తిని అభినందించారు టోర్నమెంట్ కు మొత్తం ఎనిమిది జట్లు రాగా హోరాహోరీగా జరిగిన ఈ పోటీల్లో ప్రథమ బహుమతి బిబిఎంసీ ఏ టీమ్, ద్వితీయ బహుమతి ఎం ఎం ఎఫ్ సి తృతీయ బహుమతి సహారా యూత్ జట్లు కైవసం చేసుకున్నాయి టోర్నమెంట్లో బెస్ట్ బ్యాట్స్‌మెన్ గా బి బి ఎం సి క్రీడాకారుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌస్ అందుకోగా బెస్ట్ బౌలర్‌గా బిబిఎంసీ క్రీడాకారుడు జాకీర్ షీల్డ్‌లు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ నయీమ్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు నాయకులు పంది తిరపయ్య గంధం పాండు మాజీ కౌన్సిలర్ కాజా ఫయాజ్ భాయ్ నిర్వాహకులు షేక్ దస్తగీర్ అజ్జు , ఆత హర్, మహమూద్, షారు, సుభాని, ప్రధాన దాతలు బి బి ఎం సి బి టీం జానీ బి బి ఎం సి సీనియర్ టీం సభ్యులు పలువురు సీనియర్ జూనియర్ క్రీడాకారులు క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు