Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chinta Babu Madiga : సీఎం రేవంత్ మాదిగలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి

*లక్షల డప్పులు వేల గొంతుల మహాసభకు మాదిగలు అధిక సంఖ్యలో తరలిరావాలి.

*సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి:చింతా బాబు

Chinta Babu Madiga : ప్రజా దీవెన,కోదాడ: వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే లక్షల డప్పులు, వేలగొంతుల మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో వర్గీకరణ సాధించుకొనుటకై మందకృష్ణ మాదిగ తలపెట్టిన మహాసభకు తమ మద్దతు తెలిపామని ప్రతి ఒక్క మాదిగ బిడ్డ సంకనా డప్పు వేసుకొని హైదరాబాదులో జరగబోయే సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం మేరకు తక్షణమే ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

ఈ కార్యక్రమంలో కోదాడ ఇన్చార్జి బాణాల అబ్రహం, పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని మాదిగ, జిల్లా నాయకులు పిడమర్తి బాబురావు, కందుకూరి నాగేశ్వరరావు, బల్లె పంగు స్వామి, కుడుముల చిన్న వెంకయ్య, సంజీవ్ రావు, కొత్తపల్లి శ్రీను, లింగారావు, కుడుముల కళ్యాణ్, పంది వెంకటేశ్వర్లు, శ్రీను, శ్రావణ్,సోమపంగు శ్రీను, కర్ల మనోజ్ తదితరులు పాల్గొన్నారు.