Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mahesh Vimala : ఆరేళ్లుగా ఆ దంపతుల అన్నదానం

నాంపల్లి మహేష్ విమల దంపతులు

Mahesh Vimala : ప్రజా దీవెన, నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ మార్కండేశ్వర దేవస్థానం జాతరలో భాగంగా మంగళవారం అన్నదాన కార్యక్రమం అనంతరము భావన ఋషి భద్రావతి దేవిల కళ్యాణ మహోత్సవం జరుపబడును.అన్నదాన దాతలుగా గత 6 ఆరు సంవత్సరాలుగా నాంపల్లి మహేష్,విమల దంపతులు కుమారుడు రుషి కుమార్,కుమార్తె రీతుశ్రీ లు శ్రీ మార్కండేశ్వర దేవస్థానానికి అన్నదాన పోషకులుగా ఉంటున్నారు.

 

ఈ నేపథ్యంలో అన్నదాన కార్యక్రమం కళ్యాణ మహోత్సవం విజయవంతం చేయాలని అన్నదాన పోషకులు,దేవస్థానం అధ్యక్షులు సూరెపల్లి కుచేలు,దేవస్థాన కమిటీ సభ్యులు గ్రామ ప్రజలను,భక్తులను కోరారు.