Acharya Balakrishna Reddy : ప్రజాదీవెన, నల్గొండ :తెలంగాణ ఉన్నత విద్యా మండలి వేదికగా జరిగిన సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ మరియు సభ్యులు, విశ్వవిద్యాలయ ఉపకులపతులు, సెట్ కన్వీనర్ మరియు సభ్యులు చర్చించి షెడ్యూల్ను ఖరారు చేశారు. ఎంబీఏ మరియు ఎంసీఏ ప్రవేశాల కొరకు నిర్వహించనున్న ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ మార్చ్ ఆరవ తారీఖున విడుదల చేసి, జూన్ 8, 9 తారీకుల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. జనరల్ అభ్యర్థులకు 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగ అభ్యర్థులకు 550 రూపాయల దరఖాస్తు రుసుమును ఆమోదించినట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, సభ్యులు ఆచార్య ఇటికాల పురుషోత్తం, ఎంజీయూ ఉపకులపతి, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కమిటీ చైర్మన్ ఆచార్య కాజా అల్తా హుస్సేన్, ఆచార్య ఎస్.కె మసూద్, ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు.