*పాలకూరి రవి గౌడ్
Palakuri Ravi Goud : ప్రజా దీవెన, నల్గొండ: మెజార్టీ సభ్యుల అభిప్రాయాల మేరకు బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డికి రెండోసారి అవకాశం కల్పించిన రాష్ట్ర పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవి గౌడ్.
నల్గొండ జిల్లాలో గతంలో కంటే నాగం వర్శిత్ రెడ్డి మొదటిసారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా ఓటింగ్ శాతం పెరగడానికి నాగం వర్షిత్ రెడ్డి ఎనలేని కృషి చేశారు .
ఒక యువకుడిగా, ఉత్సాహవంతుడిగా నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక మందికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపద ఉన్నవారికి ఆపద్బాంధవుడుగా ఆదుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంతో ముందుకు వెళ్తూ నల్గొండ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి కీలక పాత్ర పోషించారు.
నల్గొండ జిల్లాలో రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బిజెపి పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశిస్తున్నాం నాగం వర్శిధ్ రెడ్డి సారథ్యంలో మేమందరం నిస్వార్ధంగా పనిచేసే పార్టీ అభివృద్ధికి మా వంతుగా కూడా కృషి చేస్తామని రవి గౌడ్ తెలిపారు.