Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cyber ​​crimes : విశృంఖలంగా సైబర్ నేరాలు, న్యూ డ్ వీడియోలతో రూ. 2.53 కోట్లు వసూళ్ళు

Cyber ​​crimes : ప్రజా దీవెన, హైదరాబాద్: సైబర్ నేరాలు విశృంఖలమవుతున్నా యి. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేర గాళ్ల వల్ల అనేకమంది అమాయక ప్రజలు ఇబ్బందులు పడి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నా రు. మరికొందరు వారి బాధను భ రించలేక చివరికి ఆత్మహత్య చేసు కున్న ఘటనలు కూడా చాలా ఉ న్నాయి. ఇకపోతే, తెలంగాణ రాజ ధాని హైదరాబాద్ నగరంలోని విప్రో సంస్థలో పనిచేసిన ఓ మహి ళా సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఓ బ్లాక్ మై లర్ బెదిరించి ఏకంగా రూ.2.53 కోట్ల డబ్బులను వసూలు చేశాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగికి తన చిన్ననాటి స్నేహితురాలు భర్తగా పరిచయమ య్యాడు సాయికుమార్.

ఆ తర్వా త సాయికుమార్ వేర్వేరు ఫోన్ నెం బర్ నుండి ఫోన్ చేస్తూ తన వద్ద ఆ మహిళా ఉద్యోగికి సంబంధించిన న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ బెదిరింపులు చేశాడు. దీంతో అత డు చెప్పినట్లుగా వినాలని నిందితు డు మహిళను బెదిరించాడు. ఈనే పథ్యంలో విడతల వారీగా మహిళ ల నుంచి ఏకంగా రూ.2.53 కోట్ల ను కాజేసాడు సదరు నిందితుడు. దీంతో నిందితుడు నినావత్ దేవా నాయక్ అలియాస్ సాయికుమార్ ను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. మహిళ చేసిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు నిందితుడి ఆచూకిని కనుగొన్నారు. మొత్తానికి నిందితుడిని నిడదవోలులో అదు పులోకి తీసుకున్నారు పోలీసులు . ఆ తర్వాత అతడి నుంచి రూ. కోటి 81 లక్షల నగదును మరిన్ని స్థిర, చర ఆస్తులను సీజ్ చేశారు పోలీసులు. ప్రజలు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.