Jazula Lingangaud : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని వాటిని మెరుగుపరచడానికి ఉన్నత విద్యా మండలి ప్రత్యేక చొరవ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రొఫెసర్లు అందుబాటులో ఉండడం లేదని,ల్యాబ్ లో పరికరాలు కూడా నాసిరకమైనవి ఉంటున్నాయని,అరకొర వసతులతో నడిపిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల బండారం బయటపడాలంటే ఉన్నత విద్యా మండలి,విద్యాశాఖ,విజిలెన్స్ ఆకస్మిక తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
లక్షలకు లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాడమాడితే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా జాజుల హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఊర శ్రీనివాస్ బీసీ విద్యార్థి సంఘం నాయకులు గోదా రవీందర్ పాల్గొన్నారు