Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kishore Kumar : బిఆర్ఎస్ బలోపితానికి కృషి చేయండి

–మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్

Kishore Kumar :  ప్రజా దీవెన, శాలిగౌరారం: బిఆర్ఎస్ పార్టీ బలోపితానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కోరారు.మంగళవారం శాలిగౌరారం మండలం పెర్క కొండారం గ్రామం లోని కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు మాచర్ల రాజు, పగిడిమర్రి వెంకన్న, మేడిపల్లి శ్రీను, శీలం రమేష్, వంగూరి లక్ష్మి నారాయణ వారితో పాటు పలువురు నాయకులు మాజీ శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లోకి చేరారు.

 

బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గం లో కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లో విఫలమై నందుకు నిరసనగా తాము బిఆ ర్ఎస్ పార్టీలో చేరామని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ మండల పార్టీ అధ్యక్షులు కట్టా వెంకటరెడ్డి, నాయకులు దుబ్బ వెంకన్న,మాచర్ల అంజయ్య, నూక జానయ్య,యామగాని వెంకన్న, దేవరకొండ వెంకన్న తదితరులు ఉన్నారు.