Chiliveru Anjaya : ప్రజా దీవెన,సంస్థాన్ నారాయణపు రం : రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలివేరు అంజయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి పేదవారికి అందుతాయని ఆయన చెప్పుకొచ్చారు.
గత 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాల అమలులో బడుగు బలహీన వర్గాలకు,పేదవారికి అన్యాయం జరిగిందని ఆయన తెలియజేశారు.ప్రజలు రాష్ట్రంలో మార్పును కోరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని ఈ సందర్భంలో పేద వారికి న్యాయం జరుగుతుందని ఆయన తెలియజేశారు.