At every step, the people are drowning: అడుగడుగునా కంచర్లకు జన నీరాజనాలు
--బి ఆర్ ఎస్ మేనిఫెస్టో తూచా తప్పకుండా అమలుపరుస్తాం --మూడవరోజు ఎన్నికల ప్రచారంలో నల్గొండ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి
అడుగడుగునా కంచర్లకు జన నీరాజనాలు
–బి ఆర్ ఎస్ మేనిఫెస్టో తూచా తప్పకుండా అమలుపరుస్తాం
–మూడవరోజు ఎన్నికల ప్రచారంలో నల్గొండ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి
ప్రజా దీవెన /నల్లగొండ: నల్లగొండ శాసనసభ గత ఎన్నికల్లో నియోజకవర్గం మార్పు కోసం తనను గెలిపించమని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశానని నల్గొండ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గుర్తు చేశారు. నల్లగొండ ప్రజలు కోరుకున్న మార్పు ప్రధానంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో చేసి చూపించామని వివరించారు.
కెసీఆర్ దత్తత నియోజకవర్గమైన నల్లగొండలో ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే నన్ను మళ్ళీ మీ సేవకుడిగా, రక్షకుడుగా ఆశీర్వదించాలని కోరారు. టిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన మేనిఫెస్టోలో రైతుబంధును రూ. 12వేల నుంచి రూ. 16 వేల వరకు, ఆసరా పెన్షన్లు రూ. 3016 నుండి రూ. 5016 వరకు అదే విధంగా దివ్యాంగుల పెన్షన్లు రూ. 4016 నుండి రూ. 6016 వరకు పెంచుతామని స్పష్టం చేశారు.
గ్యాస్ సిలిండర్ రూ. 400 రూపాయలకే అందిస్తామని కెసీఆర్ ప్రకటించారని, అర్హులైన మహిళలకు నెలకు రూ. 3వేలు భృతి ఇస్తామని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చామని ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినవి కూడా తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామని తెలియజేశారు. ఏడాదిలో 365 రోజులు మీకు అందుబాటులో ఉంటూ నల్లగొండ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్న నన్ను మరొకసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పట్టణ పార్టీ కార్యదర్శి స్థానిక నాయకుడు సంధినేని జనార్దన్ రావు, 18వ వార్డ్ ఇంచార్జ్ సింగల్ విండో చైర్మన్, ఆలకుంట నాగరత్నం రాజు, రాష్ట్ర కల్లు గీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ ఆర్ వో మాలే శరణ్య రెడ్డి, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, నాంపల్లి శ్రీనివాస్ వీరాచారి, పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.