–ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఉదారతతో వైద్య సాయం
Komati Reddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి: ఆపదలో ఉన్న వ్యక్తికి ఇచ్చిన మా టప్రకారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మరో సారి మానవత్వం చాటుకున్నారు. చౌటుప్పల్ మండలం చిన్న కొం డూరు గ్రామంలో సంవత్సరం క్రితం గ్రామపంచాయతీ ట్రాక్టర్ వెనుక నుండి ఢీ కొట్టిన ఘటనలో తీవ్రం గా గాయపడి మంచానికే పరిమి తమైన తెగుళ్ల భాను అనే యువకు డిని జనవరి 26న ఇంటికి వెళ్లి ప రామర్శించారు.
భాను కోలుకోవడా నికి ఆర్థిక సాయంతో పాటు హైద రాబాదులో మెరుగైన చికిత్స అంది స్తానని ఆరోజు కుటుంబానికి హామి ఇచ్చిన ఎమ్మెల్యే, వెంటనే తన సి బ్బంది ద్వారా బాను వైద్య రిపో ర్టులు తెప్పించి హైదరాబాద్ జూ బ్లీహిల్స్ అపోలో డాక్టర్లను కన్సల్ట్ అయ్యారు.
మంగళవారం తన సొంత ఖర్చులతో చిన కొండూరు గ్రామానికి ప్రత్యేక అంబులెన్సు పంపించి భానును అపోలో ఆసు పత్రికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం చేయిస్తున్నారు. వైద్యం ఎలా అం దుతని స్వయంగా ఆసుపత్రికి వెళ్లి డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన చికి త్స అందిచాలని డాక్టర్లను కోరారు. పేదలమైన మాకు దగ్గరుండి చికి త్స చేయిస్తున్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు.