Aadhaar card : ప్రజా దీవెన, హైదరాబాద్: భారత దేశంలో ఆధార్ కార్డు జారీ చేయని ఏకైక రాష్ట్రం ఎక్కడో తెలుసా. అస లు దేశంలో ఆధార్ కార్డు అమలు లో లేని, అక్కడి పౌరులకు ఆధార్ కార్డు జారీ చేయబడని ఒక రాష్ట్రం ఉందంటే అతిశయోక్తి కాదు. ఆ రా ష్ట్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అని తెలుసా, ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డు జారీ చేయకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆధార్ కార్డు జారీ చేయకపోవ డానికి కారణాలు … భారతదేశం లోని అత్యంత సున్నితమైన ప్రాం తం జమ్మూ కాశ్మీర్. ఈ రాష్ట్రం పాకిస్తాన్, చైనాలతో సరిహద్దుల ను పంచుకుంటుంది. దీని వలన శత్రువుల చొరబాటు ముప్పు నిరం తరం ఉంటుంది. ఇది భారతదేశ భద్రతా సంస్థలకు గణనీయమైన సవాలును కలిగిస్తుంది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా, జమ్మూ కాశ్మీర్‌లో ఆధార్ కార్డుల జారీని నిషేధించారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి శత్రు దేశాలు భారతదేశంలోకి చొరబడే ప్రమాదం ఉంది. అందుకే ఆ రాష్ట్ర ప్రజలకు ఆధార్ గుర్తింపు ఉండదు. పౌరులకు ఆధార్ కార్డులు జారీ చేయబడవు. బదులుగా గుర్తింపు ప్రయోజనాల కోసం ఇతర ధృవ పత్రాలను ఉపయోగిస్తారు.