Sudhakar Reddy : ప్రజా దీవెన, మేడ్చల్: డబ్బుల స మస్యకు సంబంధించి ఓ యువతి పోలీస్ స్టేషన్ కు వస్తే రక్షణగా నిల వాల్సిన పోలీస్ కానిస్టేబుల్ పోకి రివేషాలు వెలుగు చూసాయి. అప్పు విషయంలో కొందరు ఇబ్బం ది పెడుతున్నారని గత ఏడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేష న్‌కు వచ్చిన యువతికి న్యాయం చేస్తానని నమ్మించిన కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి సదరు యువతి ని గర్భవతిని చేసిన వైనం చర్చనీ యాంశమైంది. ఓ కేసు విషయమై ఫోన్ చేసిన యువతిని లాయర్‌తో మాట్లాడుదాం అని ఇంటికి పిలిపిం చుకొని తనకి పెళ్లి కాలేదని మాయ మాటలు చెప్పి ఆమెపై కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి లైంగికదాడికి పాల్ప డ్డాడు. అదే ఏడాది జూలైలో ఆమె గర్భం దాల్చగా భయంతో యువతి కి బలవంతంగా అబార్షన్ చేయిం చాడు. ఆగస్టులో కానిస్టేబుల్‌కి పె ళ్ళైందని తెలిసి తాను మోసపో యానని గ్రహించి యువతి నిల దీయగా యువతి అడ్డు తొలగించా లని నిర్ణయించుకున్న కానిస్టేబుల్.
ఒక రోజు యువతి ఇంటికి వెళ్లి బలవంతంగా ఫినాయిల్ తాగించి, కొన్ని రోజుల తర్వాత ఆమెను ఇం టికి పిలిపించుకుని దాడి చేసి, మరోసారి బండిపై ఎక్కించుకొని కిందకి తోసి ఇలా పలుమార్లు యు వతిపై కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి దాడులకు పాల్పడ్డాడు. ఈ నెల 3న కమిషనరేట్లో యువతి ఫిర్యా దు చేయగా కేసు నమోదు చేసి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని రిమాండుకు తరలించారు.