–ద్రవ్య పరపతి విధాన కమిటీలో నిర్ణయం
–కారు, ఇంటి వంటి రుణ గ్రహీత లకు ఉపశమనం
RBI : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: దేశ ప్రజల కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. అంద రూ ఊహించినట్లుగానే ఈ ఎంఐ లు కట్టేవారికి ఆర్బిఐ ఉపశమనం కల్పించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటిం చింది. దీంతో ప్రజలకు హోమ్, కారు లోన్ సహా అన్ని రుణాలపై వడ్డీ రేటు తగ్గి ఈఎంఐ భారం తగ్గ నుంది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను శుక్ర వారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగొచ్చింది. వడ్డీ రేట్లను సవరించడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి. మే 2023 తర్వాత నుం చి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథా తథంగా ఉంచుతూ వస్తోంది. దా దాపు ఐదేళ్ల తర్వాత రెపో రేటు దిగిరావడం గమనార్హం. చివరగా కొవిడ్ పరిణామా లతో 2020 మే నెలలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ తగ్గించింది. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచింది. అనంతరం 2023 మే నెల నుంచి కీలక రేట్లను స్థిరంగా ఉంచుతూ వచ్చింది. తాజాగా 25 బేసిస్ పా యింట్లను తగ్గించింది. ఆర్బీఐ గవ ర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్య తలు చేపట్టిన తర్వాత నిర్వ హిం చిన తొలి పరపతి విధాన సమీక్ష ఇదే కావడం విశేషం. ఈ సంద ర్భంగా ఆర్బీఐ గవర్నర్ వెల్లడించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
— ఈ ఏడాది మార్చి నెలతో ముగిసే 2024 25 ఆర్థిక సంవత్సరంలో వృ ద్ధి రేటు 6.4శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా
–2025-26 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు 6.7శాతం, రెండో త్రైమాసికంలో 7శాతం, మూడో క్వార్టర్లో 6.5 శాతం, నాలుగో త్రైమా సికంలో 6.5శాతం ఉండొచ్చని అంచనా
–ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.8శాతంగా ఉండొచ్చు. ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చు. 2025-26లో రిటైల్ ద్ర వ్యోల్బణం 4.2 శాతంగా నమో దవ్వొచ్చు.
–కమర్షియల్ బ్యాంకుల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంది. బ్యాంకుల వద్ద సరి పడా ద్రవ్యలభ్యత ఉంది.