Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tandal : ‘తాండాల్’ నుండి ఆజాది పాట విడుదల

Tandal : ప్రజా దీవెన హైదరాబాద్: టాలీ వుడ్ యువ నటుడు నాగ చైతన్య, సాయి పల్లవిల రొమాంటిక్ యా క్షన్ డ్రామా ‘తాండల్’ ఫిబ్రవరి 7న విడుదల అయ్యింది. చందూ మొం డేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహి స్తున్నారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిశ్రమ సమీక్షలని అం దుకుంటుంది. శ్రీకాకుళానికి చెందిన రాజు అనే మత్స్యకారుడిగా చై న టించారు. ఈ చిత్రం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన బ్లాక్‌బస్టర్ పాటలతో అపారమైన సంచలనం సృష్టిస్తోంది. పాటలు బుజ్జీ థల్లి, శివ శక్తి, మరియు హిలెస్సో హిలె స్సో మ్యూజిక్ చార్టులలో అగ్ర స్థానంలో ఉన్నాయి. యూట్యూబ్‌ లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

తాజా గా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని నాలగవ సింగల్ ని ఆజాది అనే టైటిల్ తో విడుదల చేసారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి శ్రీ మని లిరిక్స్ అందించగా, నాకుల్ అభ్యంకార్ తన గాత్రాన్ని అందించారు. ఈ చిత్రం 2018లో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణపొందిం ది. ఈ సినిమాలో ప్రియదర్శి, దివ్య పిళై కీలక పాత్రలలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌పై బన్నీ వాస్ ఈ సిని మాని నిర్మించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిం చారు. అల్లు అరవింద్ సమర్పి స్తున్న ఈ సినిమాకి షామ్‌దత్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడి టింగ్, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరె క్షన్‌ ని నిర్వహిస్తున్నారు.