త్యాగానికి మరో రూపం రమాబాయి అంబేద్కర్
Ramabai Ambedkar : ప్రజా దీవెన, కోదాడ: పట్టణంలోని స్థానిక శకుంతల థియేటర్ ఎదురుగా అమ్మ మెడికల్ ఏజెన్సీ వద్ద కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రమేష్ మాట్లాడుతూ.
మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం రమాబాయి అంబేద్కర్ అని, మనకోసం మన దేశ భవిష్యత్తు కోసం తన కన్న పిల్లల్ని పోగొట్టుకున్న మాతృమూర్తి రమాబాయి అంబేద్కర్ అని, బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ చదువుకు, రాజ్యాంగ రచనకు వెన్నుముక రమాబాయి అంబేద్కర్ అని, కొనియాడారు ఇప్పటి తల్లుల్లా స్వార్థం ఉండి ఉంటే భవంతుల్లో రాజభోగాలు అనుభవిస్తూ ఉండేదని, కానీ ఈ దేశ అణగారిన వర్గాల కొరకు ఆమె తన పిల్లల జీవితాన్ని కూడా త్యాగం చేసి, తన కళ్ల ముందే కన్నబిడ్డలు చనిపోతున్న ఆకాశమంత దుఃఖాన్ని భూమాత లాగా దిగమింగి కోట్లాదిమంది బిడ్డల భవిష్యత్ కోసం వెలివాడల నుండి ఈ దేశ తలరాతలను రాసిన అంబేద్కర్ గారికి జీవిత భాగస్వామిగా, త్యాగశీలిగా నిలిచారని, దేశ ప్రజలందరూ కూడా ఆమె యొక్క త్యాగాన్ని కొనియాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ గౌసియా పరాహ, మాజీ వార్డు సభ్యులు గంధం రంగయ్య , పాస్టర్ యెషయా , మాజీ కౌన్సిలర్ గంధం యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంధం. పాండు,పాస్టర్ ఇస్మాయేల్, కుడుముల రాంబాబు,భరపటి కోటేశ్వరరావు, ఎస్.కె బాగ్దాద్, ఎస్.కె మస్తాన్, గుండెపంగు రవి, పెడమర్తి బాబురావు, నజీర్, సుభాని, అమర బోయిన.శ్రీకాంత్, కోలా శ్రీనివాస్,కుడుముల జాన్ పీటర్, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు.