BJP : ప్రజా దీవెన, నారాయణపురం : ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఘన విజయం సాధించడంతో నారాయణపురం మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో విజయోస్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా బీజేపీ శ్రేణులు కేక్ కట్ చేసి, బాణాసంచ కాల్చి సంబరాలు జరిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు దోనూరు వీరారెడ్డి,జక్కిలి రాజు యాదవ్,జిల్లా కమిటీ సభ్యులు వంగరి రఘు, సంగీశెట్టి లక్ష్మీనారాయణ, బచ్చనగోని దేవేందర్ యాదవ్,మండల పార్టీ అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షులు ఉష్గాగుల గిరి గౌడ్,కోలుగురి శ్రావణ్,ఏలిజాల శ్రీను, గూడూరు మంజునాథరెడ్డి,విరమళ్ళ జంగయ్య,గోల్లూరి యాదగిరి సాగర్, బండమీద కిరణ్,బద్దం యాదయ్య,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.