Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DSP K Sivaram Reddy : ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి, డీఎస్పీ కె శివరాం రెడ్డి

DSP K Sivaram Reddy :  ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :  నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ఆదేశానుసారం మిషన్ పరివర్తన్- యువతేజం కార్యక్రమంలో భాగంగా, నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన కబడ్డీ పోటీలలో గెలిచిన జట్లకు బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డి.ఎస్.పి కె శివరాం రెడ్డి మాట్లాడుతూ, గత మూడు రోజులుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ వార్డుల నుండి వచ్చిన కబడ్డీ టీములు ఎంతో ప్రతిభ కనబరిచి ఆడడం జరిగింది అని, ఈరోజు జరిగిన ఫైనల్స్ మ్యాచ్ లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిని అలవాటు చేసుకుని గెలుపోవటంలో జీవితంలో భాగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అలాగే ప్రతి ఒక్కరు ఈ క్రీడలను అలవాటుగా మార్చుకోవడం వల్ల మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా అవుతూ వారి దైనందిక జీవితంలో అద్భుత విజయాలను పొందుతారని సూచించారు.

అలాగే క్రీడల వలన మానసిక ఒత్తిడి నుండి బయట పడవచ్చు అని ప్రతి ఒక్క యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి మంచి అవకాశం గా ఉంటుందని వివరించారు. అలాగే ఈరోజు నిర్వహించిన ఫైనల్స్ మ్యాచ్లో గెలిచిన ఓల్డ్ సిటీ బాయ్స్ టీం కి మొదటి బహుమతి, రెండవ ప్రైస్ కెపీఎం బాయ్స్, మూడవ బహుమతి ఖాతాల్గుడా టీం కి మరియు బెస్ట్ ప్లేయర్స్ కి అవార్డులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రీడాకారులతో పాటు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు శంకర్, సందీప్, సైదులు, ఏఎస్ఐ వెంకటయ్య, సిబ్బంది షకీల్, శ్రీకాంత్, అలాగే ఫిజికల్ కోచ్ లు గిరిబాబు, సత్యనారాయణ, బాలు, హలీం, నాగరాజు, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.