నాంపల్లి మండలం రైతుబంధు మాజీ అధ్యక్షులు ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి
Dodla Ravinder Reddy : ప్రజా దీవెన ,నాంపల్లి : ఫిబ్రవరి 9 నాంపల్లి మండలం పరిధిలోని పెద్దాపురం గ్రామానికి చెందిన జల్లెళ్ల సత్తయ్య యాదవ్ అకాల మరణం గ్రామానికి తీరని లోటని నాంపల్లి మండలం రైతుబంధు మాజీ అధ్యక్షులు ఏడ దొడ్ల రవీందర్ రెడ్డి అన్నారు ఆయన శనివారం రోజున సత్తయ్య ప్రార్ధివ దేహానికి పూలమాల నివేసి నివాళులర్పించారు .
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి సంతాపాన్ని తెలియజేశారు సత్తయ్య మంచి భావాలు కలిగిన వ్యక్తి తన కుమారులను చదివించి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని తన కోడలు జ ల్లెల్ల యాదమ్మను సర్పంచిగా గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో తన ముద్ర వేసుకున్నారని ఆయన సేవలను కొనియాడారు .
ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు సఫావ ట్ సర్దార్ నాయక్ నరసింహులగూడెం మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ పెద్దాపురం మాజీ ఉపసర్పంచ్ సుందర్ బి ఆర్ఎస్ నాయకులు ఏడుకొండలు జల్లెల సైదులు యాదవ్ మేకల శ్రీనివాస్ రెడ్డి ఒంటెద్దు సత్తిరెడ్డి మెగావత్ హనుమంత్ యాదగిరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు