Competitions : ప్రజా దీవెన, కోదాడ: పట్టణములో స్థానిక తేజ టాలెంట్ పాఠశాల లో ఒకటవ తరగతి చదువుచున్న జె.తుహిన శ్రీ విద్యార్థి నేషనల్ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్ షిప్ వరంగల్ లో నిర్వహించిన కరాటే పోటీల్లో ప్రథమ బహుమతి, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా అండర్ 15 చెస్ టోర్నమెంట్ సూర్యాపేట లో నిర్వహించిన పోటీల్లో అండర్ 11 విభాగంలో డి. శామ్యూల్ , శర్వన్ , బి. కార్తికేయ , సత్యానంద సాయి నాల్గురు విద్యార్థులు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో బహుమతులు సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ ఎం అప్పారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కరాటే, పోటీలలో అత్యంత ప్రతిభను కనపర్చి బహుమతులు సాధించిన విజేతలకు అవార్డులను, మెమొంట్ లను అందించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభినందించారు .
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అప్పారావు మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విజేతలగా నిలిచిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని వారు కూడా ఆటలలో రాణించి బహుమతులను తీసుకొచ్చి పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని తెలిపారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం.అప్పారావు,సెక్రెటరీ వై.సంతోష్ కుమార్ , వైస్ ప్రిన్సిపల్ సోమనాయక్, ఇన్చార్జులు రేణుక,రామ్మూర్తి, పీఈటీలు రాంబాబు,గణేష్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.