ఏసీబీ వలకు చిక్కిన విద్యాధికారి
ACB Educationofficer : ప్రజా దీవెన, చిలకలూరిపేట: తెలుగు రాష్ట్రాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అవి నీతి అధికారుల భరతం పడుతూ గుబులు పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట మండల విద్యాధికారి లంచం తీసుకుంటూ ఏసీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టు బడ్డారు. చిలకలూరిపేట ఎంఈఓ లక్షిబాయి నివాసం పై ఏసీబి అధికారులు అకస్మాత్తుగా దాడులు ప్రారంభించారు.
పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు చల్లా వెంకట శ్రీనివాస రావు పిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా పథకం ప్రకారం దాడులు జరిపి విచారణ ప్రారంభించారు. పిఎఫ్ డబ్బులు ఫైల్ ట్రెజరీ కి పంప డానికి ఎంఈఓ లక్ష్మీబాయి రూ. 30 వేలు డిమాండ్ చేయడం, త ద్వారా డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా ఎసీబి అధికా రులు పట్టుకున్నారు. మధ్యవర్తి మాజేటి వెంకట శ్రీనివాస్ రావు చేత ఎంఈఓ లక్ష్మి డబ్బులు డిమాండ్ చేయడంతో ఇద్దరినీ పట్టుకున్నారు గుంటూరు ఏసీబీ అధికారులు.