Ravinder Rao : ప్రజా దీవెన హైదరాబాద్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో శ్రీ బ్రిలియంట్ స్కూల్లో సైకో ప్రిన్సిపల్ రవీందర్ రావు విద్యార్థులపై లైంగిక వేధింపులకు గురి చేస్తూ శునకానందం పొందు తున్నాడని వెంటనే అతనిపై కేస్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య దర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఓయూ లోని ఆర్ట్స్ కళాశాల వద్ద జాజుల మాట్లాడుతూ విద్యా బుద్ధులు నేర్పుతూ విద్యార్థులను సొంత పిల్లల చూసుకుంటూ వారి యొక్క భవిష్యత్ ను తీర్చిదిద్ది గొప్ప ప్ర యోజకులను చేయాల్సింది పోయి ఇలా ఒక రాక్షసుడి వలె ప్రవర్తించ డం సమాజం తలదంచుకునేలా ఉందన్నారు.
స్కూల్ గుర్తింపు రద్దు చేసి ప్రిన్సిపల్ ను ఖటినంగా శిక్షిం చాలని లింగంగౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగా ణ విద్యార్థి యువజన పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బూర శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయ కులు గోదా రవీందర్ పాల్గొన్నారు