Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Route map : పెద్దగట్టు కు రూట్ మ్యాప్, సూ ర్యాపేట పోలీసుల నిర్ణయం

Route map : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లాలో ఈ నెల 16వ తేదీ తెల్లవారుజాము నుంచి జాతీ య రహదారి 65 పై వాహనాల మ ళ్ళింపు అక్షలపై నిర్ణయం ప్రకటిం చారు. సూర్యాపేట పోలీసులు. ఇం దులో భాగంగా వాహనాల మళ్లిం పు, వాహనాల పార్కింగ్ స్థలాల ఏ ర్పాటు తదితర అంశాల పై దృష్టి సారించారు. పోలీసులు. భక్తులు, వాహ న దారులు పోలీసులు సూ చనలు పాటించాలని సూచించా రు. NH 65 పై హైద్రాబాద్- విజయ వాడ వె ళ్ళే వాహనాలు నార్కట్ పల్లి, న ల్గొండ,మిర్యాలగూడ, హు జూర్ నగర్, కోదాడల మీదుగా మ ళ్లింపుకు నిర్ణయం తీసుకున్నా రు.

వాహనాల మళ్లింపు కు ప్రత్యే క చర్యలు… తెలంగాణ రాష్ట్ర రెండవ అతిపెద్ద జాతర దురాజు ప ల్లి పెద్దగట్టు జాత ర ఫిబ్రవరి16వ తేదీ నుండి జరగనున్న సందర్బం గా జాతీయరహదారి (NH) 65 పై సూర్యాపేట జిల్లా పోలీస్ వాహ నా ల మళ్లింపుకు ప్రత్యేక చర్యలు తీ సుకోవడం జరిగినదని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలి పారు.జాతీయరహదారిపై వాహ నాల మళ్లింపు, జాతరకు వచ్చే వా హనాల పార్కింగ్ స్థలాలకు సంభం దించి రూట్ మ్యాపు లను సిద్దం చే యడం జరిగిoదన్నారు. జాతర సందర్భంగా రోజు మూడు విడ తల్లో 24 గంటలు పోలీసు బందో బస్తు నిర్వర్తిస్తామన్నారు. ప్రజలు , భక్తులు, వాహనదారులు పోలీసు వారి సూచనలు పాటిస్తూ సహ కరించాలన్నారు.
మళ్ళింపు ఇలా: (1) నార్కట్ పల్లి వద్ద :-హైదరాబాద్ నుండి విజయ వాడ వైపు వెళ్ళు వాహనా లను నార్కట్ పల్లి వద్ద మళ్లించి నల్గొండ వై పు గా మిర్యాలగూడ, హుజూర్ గర్, కోదాడ మీదుగా విజయవాడ కు పంపడం జరు గుతుంది.
మళ్ళింపు (2) కోదాడ వద్ద :- విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను, కోదాడ వద్ద మళ్లించి హుజూర్నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా హైద్రాబాద్ మళ్ళించడం జరిగినది.
మళ్ళింపు (3) :- హైద్రాబాద్ నుండి ఖమ్మం వెళ్ళే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయరహదారి 365 BB మీదుగా వెళ్లాలి.

సూర్యాపేట-కోదాడ వెళ్ళే వా హనాల మళ్ళింపు:
కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వచ్చే RTC బస్సులు, ఇతర చిన్న ప్రజా రవాణా వాహనాలు SRSP కెనాల్ నుండి బీబిగుడెం వద్ద నుండి సూర్యాపేట పట్టణానికి పంపడం జరుగుతుంది. సూర్యాపేట పట్టణం నుండి కోదాడ వెళ్ళే RTC బస్సులు, ప్రజా రవాణా వాహనాలు కుడ కుడ గ్రామం మీదుగా ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయరహదారి మీదుగా రాఘవపురం స్టేజి నుండి నామవరం గ్రామం మీదుగా జాతీయరహదారి 65 పై గుంజలూరు స్టేజి వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపుకు పంపించడం జరుగుతుంది.
హజాతరకు వచ్చు భక్తుల వాహనాల పార్కింగ్ నిమిత్తం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగినది.

మొదటి పార్కింగ్ ప్రదేశం :
సూర్యాపేట మీదుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను NH 65 మీద గల HP పెట్రోల్ బంక్ నుండి రాంకోటి తండాకు వెల్లు మార్గంలో వాహనాల పార్కింగ్ కు ద్విచక్ర వాహనాలను, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఏర్పాటు.

రెండవ పార్కింగ్ ప్రదేశం :
గరిడేపల్లి, పెనపహడ్ వైపుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను కలక్టర్ పాత కార్యాలయం వెనుక గల స్థలంలో భారి పార్కింగ్ స్థలం ఏర్పాటు.

మూడవ పార్కింగ్ ప్రదేశం :
కోదాడ, మునగాల, గుంపుల వైపుగా జాతర కు వచ్చే భక్తుల వాహనాలను ఖాసింపేట గ్రామం వెల్లు మార్గంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు.

నాలుగోవ పార్కింగ్ ప్రదేశం :
మోతే, చివ్వేంల మీదుగా జాతరకు వచ్చే భక్తుల వాహనాలను చివ్వేం ల మీదుగా మళ్లించి మున్యా నా యక్ తండా వద్ద (గట్టుకు వెన కాల) పార్కింగ్ స్థలం కేటాయిం చడం జరిగింది.