Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Lakshminarayana Reddy : గ్రాండ్ టెస్ట్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం.

*సమాజ హితము కోరే వారే జర్నలిస్టులు: లక్ష్మీనారాయణ రెడ్డి.

Lakshminarayana Reddy : ప్రజా దీవెన, కోదాడ: కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం, చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం పట్టణంలోని స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.

కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీసేందుకు మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.

మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్వహించని గ్రాండ్ టెస్ట్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించారని ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరినాడరు. గత కొంతకాలంగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సారధ్యంలో జర్నలిస్టుల కల త్వరలోనే సహకారం అవుతుందని తెలిపారు అనంతరం జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు మాట్లాడుతూ.

కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారితో నాకు విడ దీయారాని పరిచయం ఉందని, తప్పనిసరిగా జర్నలిస్టుల సమ స్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. అనంతరం టి యు డబ్ల్యూ జే హెచ్ 143 యూనియన్ జిల్లా అధ్యక్షులు వజ్జే వీరయ్య మాట్లాడుతూ జర్నలిజం కత్తి మీద సాము లాంటిదని ప్రభుత్వాలు మారుతున్న పాలకులు మారుతున్న జర్నలిస్టుల సమ స్యలు మారడం లేదన్నారు. గత ప్రభుత్వంలో కూడా జర్న లిస్టుల సమస్యల పరిష్కారమవుతాయని ఆశగా ఎదురు చూసామని కానీ అది సాధ్యం కాలేదని ప్రస్తుత ప్రభుత్వంలోనేన సమస్యలు పరి ష్కారం అవుతాయని ఆశిస్తున్నామని తెలిపారు.

అనంతరం సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజ నగౌడ్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తప్పనిసరిగా కోదాడ నియోజ కవర్గ వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరిస్తారని ఆ నమ్మకం మాకు ఉందంటూ తెలిపారు.

అనంతరం కోదాడ వ్యవసా య మార్కెట్ చైర్మన్ ఏపూరి తిరుపత మ్మ, సుదీర్ దంపతులను మీడియా ఆధ్వర్యంలో ఘనంగా సన్మా నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగి రెడ్డి, యూనియన్ ప్రధాన కార్యదర్శి హారి కిషన్, ఎంఈఓ సలీం షరీఫ్, ఎలక్ట్రాని మీడియా జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరావు, వంగవీటి శ్రీనివాసరావు, కోలిచలం నరేష్, సిరికొండ శ్రీనివాస్, సోమపంగు గణేష్, పూర్ణచంద్రరావు,యం లక్ష్మణ్,కె సైదులు,యం సురేష్,జి రాము,జి వెంకటనారాయణ, శేఖర్, గోపాల్, వాసు, సంపత్, తదితరులు పాల్గొన్నారు