బిగ్ బ్రేకింగ్, అల్లుఅర్జున్ కు రామ్ చరణ్ అన్ ఫాలో షాక్..?
–బన్నీ, చరణ్ అభిమానుల మధ్య ఫ్యాన్ యుద్ధం
MegaHeros: ప్రజా దీవెన, హైదరాబాద్: సోషల్ మీడియా వేది కగా సినీ అభిమా నుల యుద్ధభేరి తారాస్థాయికి చేరుకున్నట్లు జో రుగా ప్రచారం సాగుతోంది. అదికాస్తా ఇద్దరు మె గా హీరోల మధ్య అగాదానికి దారి తీసిందని తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్క ర్లు కొడుతోంది. మెగా హీరో లు అల్లు అర్జున్, రామ్ చరణ్ ల మధ్య సోషల్ మీడియా దూరం పెరిగిందని, ఇన్స్ట్రాగ్రామ్ లో లైక్ , అన్ లైక్ ల వరకు చేరు కోవడమే అందుకు నిదర్శనంగా నిలుస్తుందని తెలుస్తోంది. టాలీ వుడ్ తో పాటు బాలీవుడ్ లో సైతం అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు.
ఇద్దరూ బంధు వులే అయినప్పటికీ కొన్ని రోజులుగా రెండు కుటుం బాల మధ్య కొం త గ్యాప్ వచ్చిందనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. మెగా కాంపౌం డ్, అల్లు కాంపౌండ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మెగా, అల్లు అభిమానుల మ ధ్య పెద్ద ఎత్తున ఫ్యాన్ వార్ జరుగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రా మ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశారు. ఇప్పుడు ఈ విషయం సినీ ప్రేక్షకుల్లో పెద్ద చర్చ ను లేవనెత్తింది.