నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య
Narayanacollegecrime: ప్రజా దీవెన, విశాఖపట్నం: ఉభ య తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వి ద్యాసంస్థ నారాయణ కళాశాలల్లో విద్యార్ధుల బలవర్మరణాలు కొన సాగుతూనే ఉన్నా యి. విద్యా ర్థు లు మానసిక ఒత్తిడిని జయిoచలేక ఆత్మహత్యలకు పాల్పడడం పట్ల తల్లితండ్రులు తల్లడిల్లుతు న్నారు. నారాయణ కాలేజీ యాజ మా న్యం ఒత్తిడితో ఓ విద్యార్థి, ఆ త్మహత్యకు పాల్పడగా ఈ ఘట న పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థి సంఘాలు గురువారం ఉ దయం ఆందోళన చేపట్టాయి. తాజా సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఒడిశా రాష్ట్రం రాయ్ పూర్ కు చెందిన చంద్ర వంశీ (17 ) అనే వి ద్యార్థి, విశాఖపట్నం మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజీ లో ఇం టర్ సెకండ్ ఇయర్ చదువుతు న్నాడు, ఏం జరిగిందో తెలి యదు గానీ బుధవారం రాత్రి కాలేజీ బిల్డిం గ్ పై నుంచి ఆత్మహత్య చేసుకున్నారు.అయితే కాలేజీ యాజమా న్యం నుంచి ఒత్తిడి భరించ లేకనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చని పోయినట్లు విద్యార్థి సం ఘాలు ఆరోపి స్తున్నాయి.