అధినేత కేసీఆర్ ఆగమనం,19న బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమా వేశం
BRSkcr: ప్రజా దీవెన, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆ ర్ఎస్) రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావే శాన్ని ఈనెల 19 వ తేదీన నిర్వ హించాలని బిఆర్ఎస్ పార్టీ అధి నేత కె.చంద్రశేఖర్ రా వు నిర్ణయించారు. తన అధ్యక్షతన జరిగే ఈ కార్యవర్గ సమావే శాని కి సంబం ధించి ఏర్పాట్లు చేయాలని ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రసి డెంట్ కె.టి.రామారావు ను ఆదేశించారు.అధినేత ఆదేశాలమేరకు ఈనెల 19 వ తేదీన మధ్యాహ్నం 1 గంట నుండి హైద్రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం తలపెట్టనున్నారు.
అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అ ధ్యక్షులు, ప్రస్థు త మరియు మాజీ ఎంపీలు, శాసన మండలి స భ్యు లు, శాసన సభ్యు లు, కార్పోరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మ న్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలతో కూడిన విస్తృతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించను న్నామ ని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు.
ఈ నెల 19 న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో, బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడు కల నిర్వ హణతో పాటు పార్టీ సభ్య త్వ నమోదు, పార్టీ నిర్మా ణం తది తర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించ నున్నామని కెటిఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ ప్రభు త్వం అనుసరి స్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫ ల్యాలమీద ప్రధానంగా చర్చ జరగనున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుగుణంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేపట్ట వలసిన కార్యాచర ణ పై సమగ్ర చర్చ జరగనున్నది.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ, తమ హక్కుల ను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందు కు పార్టీ నాయకత్వం కార్యకర్తలు శ్రేణులు అనుసరించాల్సిన వ్యూ హా లు విధానాల పై ఈ విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో చర్చించ నున్నారని కేటిఆర్ తెలి పా రు. సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణ యాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి ఆహ్వానితులందరూ విధి గా హాజరుకావాలని కెటిఆర్ స్పష్టంచేశారు.