Big breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాదులో సంచలన సంఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఊహించని పరిణా మం చోటు చేసుకుంది. జీవిత ఖైదు పడిన ఓ నేరస్తుడు కోపం తట్టుకో లేక జడ్జి పట్ల దురుసుగా ప్రవర్తిం చాడు. శిక్ష ప్రకటించిన వెను వెం టనే రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిపై సదరు ముద్దాయి చెప్పు విసిరిన ఘటన అకస్మాత్తుగా జర గడంతో అంతా అవాక్కయ్యారు. పోక్సో కేసులో ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించిన మ రుక్షణమే తనను దోషిగా ప్రకటిం చడాన్ని జీర్ణించుకోలేక చెప్పు విసిరి సంచలనం సృష్టించాడు. పోక్సో కోర్టు న్యాయమూర్తిపై చెప్పు విసిరాడు.
పోక్సో కేసులో తనను జడ్జి దోషిగా ప్రకటించడంతో జీర్ణిం చుకోలేకపోయాడు. జడ్జిపై చెప్పు విసిరాడు. జరిగిన ఘటనతో అక్క డున్న వారంతా షాక్ కు గురయ్యా రు. కోర్టులో ఉన్న న్యాయవాదులు నేరస్తుడిని పట్టుకుని చితకబాదా రు. అనంతరం పోలీసులకు అప్ప గించారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.