— ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రవ ర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ మరి యు వరంగల్ -ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి చెప్పారు. నామినేషన్ ల ఉపసం హరణ అనంతరం గురువారం ఆమె ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని కల బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లతో జిల్లా కలెక్టర్ కార్యాల యంలోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఎన్ని కలలో పోటీలో ఉన్న అభ్యర్థులు పాఠశాల సమయాలలో ప్రచారం చేయడం నిషిద్ధమని , అనుమతు ల కోసం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గం పరిధిలో ఉండే ఆయా జిల్లా ఎన్నికల అధి కారులు, సహాయ రిటర్నింగ్ అధికా రులతో అనుమతులు తీసుకోవ చ్చని తెలిపారు. మొత్తం నియోజక వర్గా నికి సంబంధించిన అనుమ తులను నల్గొండ ఆర్ ఓ ద్వారా తీసు కోవచ్చని చెప్పారు. ముఖ్యం గా వాహనాలు, ర్యాలీలకు సంబం ధించిన అనుమతులు ఆయా జిల్లాల లో తీసుకోవచ్చని తెలి పారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలింగ్ ఏజెంట్ల నియామకం, కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు వెంటనే సమర్పించాలని, గుర్తింపు కార్డులకు ఫోటోలను వెంటనే ఇవ్వాలని అన్నారు. ఈ నెల 10న ప్రచురించిన ఓటరూ జాబితా ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల వివరాలను ఆమె అభ్యర్థు లకు తెలియజేస్తూ 25797 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. నల్గొండ సమీపంలోని ఆర్జాల భావి వద్ద ఉన్న గోదాంలో స్ట్రాంగ్ రూమ్ తో పాటు ,ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లా ఎస్పీ శరత్చం ద్ర పవార్ మాట్లాడుతూ ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయ డం జరుగుతుందని, అభ్యర్థులు ర్యాలీలు, సమావేశాలకు తప్పని సరిగా ముందస్తు అనుమతి తీసు కోవాలని, అలాగే కాన్వాసింగ్ వెహి కల్స్ కు సైతం ముందే అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల ఏజెంట్లను నియామకంలో ఎలాంటి నేరచరిత లేని వారిని ఎంపిక చేయాలని అన్నారు. అభ్యర్థుల వద్ద ఎలాంటి లైసెన్స్ ఆయుధాలు ఉన్న ముందే డిపా జిట్ చేయాలని, ఎన్నికల నిబం ధనల ప్రకారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు లౌడ్ స్పీకర్ల కు అనుమతి ఉంటుందని ,కౌంటింగ్ సందర్భంగా మూడంచల భద్రత ఉంటుందని, సీసీటీవీ కెమెరాల నిఘాలో భద్రత ను పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అదనపు కలెక్టర్ జే .శ్రీని వాస్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్త నా నియమావళి, ప్రజాప్రతినిధ్య చట్టం 127 ప్రకారం ప్రచురించే కరప త్రాలు, వాటి నియమ నిబం ధనలు ,అలాగే మీడియా సర్టిఫికే షన్ కమిటీ ద్వారా తీసుకునే అనుమ తులపై వివ రించారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల నియమాలని తూ.చా తప్పకుండా పాటించాలని, లేనట్లయితే ఎన్నిక ల నియమావళిని ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవడం జరుగు తుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా 25 టేబుళ్లు ఏర్పాటు చేయడం జరుగుతుం దని, ప్రతి అభ్యర్థి ఒక ఏజెంట్ ను ఒక టేబుల్ కు నియమించుకో వచ్చని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.