Stampede Elephants : ప్రజా దీవెన, కేరళ: కోజికోడ్‌లోని కోయిలాండిలో జరిగిన ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసు కుంది.మణికులంగర ఆలయంలో ఉత్సవం జరగుతుండగా భక్తులు బాణాసంచా పేల్చారు. ఉత్సవాల కోసం ఆలయానికి రెండు ఏనుగుల ను తెచ్చారు. అయితే గురువారం రాత్రి ఉత్సవాలు జరుగుతున్న స మయంలో టెంపుల్ ఆవరణలో క్రాకర్స్ పేల్చడంతో పీతాంబరన్ , గోకుల్ అనే రెండు ఏనుగులు భ యంతో పరుగులుపెట్టాయి. టపా సుల శబ్ధాలకు ఉత్సవాల కోసం తెచ్చిన ఏనుగులు భయపడిపోయి జనంపైకి కదిలాయి.
ఈ తొక్కిసలా టలో ముగ్గురు భక్తులు మరణించా రు. మరో 30 మందికిపైగా గాయప డ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్ష తగాత్రులను కోజికోడ్ మెడికల్ కా లేజీ ఆసుపత్రికి తరలించి మెరుగై న వైద్యం అందిస్తున్నారు.