Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Railway Station : నేలమట్టమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

–క‌నుమరుగైన మరో పురాత‌న క‌ట్ట‌ డం

–1847 లో నిజాంనవాబులో శ్రీకా రం

Railway Station : ప్రజా దీవెన, సికింద్రాబాద్: తెలం గాణ రాజధానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ భవనాలు నేలమట్టమయ్యాయి. ఆధునికీకరణ పనుల్లో భాగంగా 1952లో కట్టిన సికింద్రాబాద్‌ స్టేషన్‌ ప్రధాన భవనాలను రైల్వే అధికారు లు గురువారం కూల్చివేశారు. దీం తో అప్పటి కళలు, సంస్కృతి ఉట్టి పడేలా నిర్మించిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. 1874లో అ ప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. 1916 వరకు నిజాం గ్యారెంటెడ్‌ స్టేట్‌ రైల్వే (ఎన్‌జీఎ్‌సఆర్‌)కు ఇదే ప్రధాన స్టేష న్‌గా ఉండేది. 1951లో ఎన్‌జీఎస్ ఆర్‌ను జాతీయం చేయడంతో ఇండియన్ రైల్వేస్ లో సికింద్రాబా ద్‌ స్టేషన్‌ భాగమైంది.

 

1952లో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రధాన భవనాన్ని అప్పటి ప్రభుత్వం నిర్మిం చింది. దీని పోర్టికో నిజాం ఆర్కిటె క్చర్‌కు అనుగుణంగా కోటను పోలి ఉంటుంది. ఇది ఇలా ఉంటే రూ. 720 కోట్ల వ్య‌యంతో సికింద్రాబాద్ స్టేష‌న్ ను అధునీక‌రిస్తున్నారు. మ రో ఏడాదిలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎయిర్‌పోర్టును తలపిం చేలా మారనుంది. చేపట్టిన స్టేషన్‌ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగం గా ఐకానిక్ భ‌వ‌నాన్ని నేడు కూల్చి వేశారు.