Chairman Dr.Kesavulu Mudiraj : ప్రజాదీవెన, నల్గొండ : సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎన్నికల గురించి ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మీడియా సమావేశం
లో రేపటి పౌరులను తీర్చిదిద్ది సమాజానికి దిక్సూచిగా ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులు, పట్టభద్రుల కు జరిగే ఎన్నికలలో వందకు వంద శాతం ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యా పరిరక్షణలో చరిత్ర సృష్టించాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా.బొమ్మర బోయిన కేశవులు ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నల్లగొండలోని డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువుకున్నవారు, మేధావులు ఎంత పని ఉన్నా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుని సాధారణ ఓటర్లకు మార్గదర్శకులుగా నిలవాలని కోరారు. అభ్యర్థులు ఎవరూ నచ్చానీ పక్షంలో నోటాకు ఓటు వేయాలని, ఓటు ను ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయవద్దని తెలిపారు.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ కి ఓటర్ చైతన్యం పై కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీచర్స్ నియోజకవర్గం ఎన్నికలపై ఓటర్ల తో చర్చావేదిక నిర్వహిస్తామని, గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఓటర్లకు సెమినార్ నిర్వహిస్తామని తెలిపారు. నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.
ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు మరియు పారదర్శకంగా ఎన్నికలు జరిగే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. మీడియా మిత్రులు 100 శాతం పోలింగ్ నమోదుకు పూర్తి సహకారం అందించాలని కోరారు ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మాట్లాడుతూ డాక్టర్ బొమ్మర బోయిన కేశవులు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో తాజాగా జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వంద శాతం ఓటింగ్ బమోదుకు, పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేసినందుకు ఇటీవల గవర్నర్ పురస్కారం అందుకున్న జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశర్ల సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఓఎస్డీ ప్రో.అంజిరెడ్డి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తొకల సుధారాణి, డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కోఆర్డినేటర్ డా.అంతటి శ్రీనివాస్, మాధగోని భిక్సపతిగౌడ్, సమాచార పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు తాళ్ళ నిరంజన్, రేఖ్యానాయక్, కట్ట శ్రీనివాస్, మెట్టు మధు, శ్రీకాంత్, మహేష్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.