ప్రభుత్వం కీలక నిర్ణయం,పిఎసిఎస్ పాలకవర్గాల గడువు పొడిగిం పు
Telanganagovernment: ప్రజా దీవెన హైదరాబాద్: తెలం గాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలక వర్గ గడు వును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. రా ష్ట్రం లోని మొత్తం 904 సహకార సం ఘాలు కాలపరిమితితో పాటు 9 డీసీసీబీ చైర్మన్ల పదవి కాలాన్నీ మరో ఆరు నెలలు పొడిగిస్తూ శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేసింది.
పాలక వర్గ పదవీ కాలానికి 6 నెల ల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవు తోంది. కానీ ఫిబ్రవరి 15వ తేదీ సమీపానికి వచ్చినా ఇంత వరకు రాష్ట్ర సహకార సంఘాల రిజి స్ట్రార్ నుంచి ఎటువంటి ప్రకట న వెలువడలేదు.దీంతో సహకార సంఘాల కాలపరిమితిని మరో ఆరు నెలలు పొడి గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరో వైపు ఫిబ్రవరి 11వ తేదీన ప్రాథమి క వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గా ల పదవికాలం పొడి గించాలంటూ వ్యవసా య శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావును డీసీ సీబీ చైర్మన్లు కలిసి విజ్జప్తి చేశారు. ఈ మే రకు వినతి పత్రం సమర్పించారు. ఫిబ్రవరి 15వ తేదీతో తమ పద వి కాలం ముగియనుండగా ఇంత వరకు సహకార సంఘాల రిజి స్ట్రార్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.