Tamilnadu: ప్రజా దీవెన తమిళనాడు: తమిళనాడు రాష్ట్రం మైలాడుతులై జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు ఇద్దరు యువకులను దారుణంగా హత్య చేశారు. మద్యం వ్యాపారులే ఈ హత్యలకు ప్రధాన పాత్ర, సూత్రధారులై ఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ముట్టం గ్రామంలో మద్యం వ్యాపారులపై విద్యార్థులు తిరగబడిన క్రమంలోనే ఈ ఘాతుకం జరిగి ఉంటుందని తెలుస్తోంది. విద్యార్థులు పట్టుబట్టి ఆందోళన కార్యక్రమాల ద్వారా గ్రామంలో బెల్టు షాపులు మూసి వేయించారన్న కక్షతో ముగ్గురు మద్యం వ్యాపారులుసదరు విద్యార్థులను కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సింది.